యూజీసీ పీహెచ్‌డీ అడ్మిషన్ల నిబంధనలను మార్చేసింది. నాలుగేళ్ల అండర్ గ్రాడ్యుయేట్ కోర్సు పూర్తిచేసిన వారికి పీహెచ్‌డీ ప్రోగ్రామ్స్‌లో ప్రవేశం కల్పించేందుకు వీలుగా యూనివర్శిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) అడ్మిషన్ నిబంధనలను సవరించింది. నాలుగేళ్ల అండర్ గ్రాడ్యుయేట్ డిగ్రీ ఉన్న విద్యార్థులు నేరుగా పీహెచ్‌డీ ప్రోగ్రామ్‌లను కొనసాగించవచ్చని యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) చైర్మన్ జగదీష్ కుమార్ బుధవారం తెలిపారు.
కామన్ ఎంట్రన్స్ టెస్ట్ ద్వారా రాష్ట్రంలోని పీహెచ్‌డీ సీట్లను భర్తీ చేయడానికి ఆయా యూనివర్సిటీలు అంగీకరించాయి. ఇప్పటికే దీనిపై విధి విధానాలను రూపొందించాలని అధికారులు నిర్ణయించారు. సోమవారం రాష్ట్ర ఉన్నత విద్యా మండలి చైర్మన్ లింబాద్రి ఆధ్వర్యంలో యూనివర్సిటీల వీసీల సమావేశం జరిగింది. పీహెచ్‌డీ అడ్మిషన్ల విధానంలో అనేక లోపాలు ఉన్నాయని, వాటిని అధిగమించడానికి కొత్త పద్ధతులు అనుసరించాలని ఇప్పటికే యూజీసీ అన్ని రాష్ట్రాలకు సూచించిన విషయం తెలిసిందే. ఈ అంశంపై చర్చించిన రాష్ట్రంలోని వర్సిటీల అధికారులు..…