తూర్పు నావికాదళం నిర్వహిస్తున్న ప్రెసిడెంట్ ఫ్లీట్ రివ్యూ కి అంతా రెడీ అయింది. సోమవారం ఉదయం 9 గంటలకు రివ్యూ ప్రారంభం కానుంది. ఈ సమీక్షలో పాల్గొనేందుకు భారత రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ఆదివారం సాయంత్రమే విశాఖ వచ్చారు. ఆయనకు ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్, సీఎం జగన్ పుష్పగుచ్ఛాలు ఇచ్చి సాదరంగా స్వాగతం పలికారు. రాష్ట్రపతికి సీఎం జగన్ ప్రత్యేకంగా జ్ఞాపికను బహూకరించారు. 9కి ప్రారంభం కానున్న ప్రెసిడెంట్ ఫ్లీట్ రివ్యూ 9.07 కి…