Rahul Gandhi: పార్లమెంట్ సమావేశాల సమయంలో కాంగ్రెస్ రాజ్యసభ ఎంపీ రేణుకా చౌదరి ‘‘కుక్క’’ను తీసుకురావడం వివాదాస్పదమైంది. ఈ వివాదంపై కాంగ్రెస్ ఎంపీ, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ మాట్లాడారు. ఆయన రేణుకా చౌదరికి మద్దతు ఇచ్చారు. ‘‘పార్లమెంట్‌కు కుక్కల్ని అనుమతించరా.?’’ అని వ్యంగ్యంగా మాట్లాడారు.