Rahul Gandhi: పార్లమెంట్ సమావేశాల సమయంలో కాంగ్రెస్ రాజ్యసభ ఎంపీ రేణుకా చౌదరి ‘‘కుక్క’’ను తీసుకురావడం వివాదాస్పదమైంది. ఈ వివాదంపై కాంగ్రెస్ ఎంపీ, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ మాట్లాడారు. ఆయన రేణుకా చౌదరికి మద్దతు ఇచ్చారు. ‘‘పార్లమెంట్‌కు కుక్కల్ని అనుమతించరా.?’’ అని వ్యంగ్యంగా మాట్లాడారు. పార్లమెంట్ బయట మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ ఈ రోజు కుక్క ప్రధానాంశంగా నిలిచింది. ఆ చిన్న కుక్క ఏం చేసింది.? ఇక్కడికి కుక్కలకు అనుమతి లేదా?’’ అంటూనే, పార్లమెంటు భవనాన్ని చూపిస్తూ, “కానీ వారిని లోపలికి అనుమతించారు” అని అనుచిత వ్యాఖ్యలు చేశారు. పరోక్షంగా బీజేపీ, ఎన్డీయే నేతల గురించి రాహుల్ గాంధీ ఈ వ్యాఖ్యలు చేయడం వివాదాస్పదమయ్యాయి.
Read Also: Imran Khan: ఇమ్రాన్ ఖాన్ ప్రాణాలతో ఉన్నాడు, కానీ.. సోదరి సంచలన ఆరోపణలు..
పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభమైన సోమవారం, ఎంపీ రేణుకా చౌదరి ఒక కుక్కతో పార్లమెంట్‌లోకి ప్రవేశించడం వివాదాన్ని ప్రారంభించింది. ఆమె చర్యను చాలా మంది ఎంపీలు ఖండించారు. అయితే, ఆమె అన్నింటిని తోసిపుచ్చుతూ, నిజమైన కుక్కలు పార్లమెంట్ లోపల కూర్చుని ప్రజల్ని కరుస్తున్నాయని అన్నారు. తాము మూగ జంతువుల్ని ప్రేమగా చూసుకుంటామని అన్నారు. పార్లమెంట్‌లో కుక్కల్ని నిషేధించే చట్టం ఏమైనా ఉందా? అని ఎదురు ప్రశ్నించారు.