వాహనదారులకు పెట్రోలియం శాఖ గుడ్‌న్యూస్ చెప్పే సూచనలు కనిపిస్తున్నాయి. పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గే అవకాశం ఉందని పెట్రోలియం శాఖ కార్యదర్శి ఈ మేరకు సంకేతాలు ఇచ్చారు. అంతర్జాతీయంగా క్రూడాయిల్ ధరలు భారీగా పడిపోవడం.. ఇంకోవైపు దేశంలో రెండు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు కూడా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించేందుకు పెట్రోలియం శాఖ ఏర్పాట్లు చేస్తోంది.