పెట్రోల్ బంకులు ఎప్పుడూ వాహనదారులతో రద్దీగా ఉంటాయి. పెట్రోల్, డీజిల్ కోసం వాహనదారులు క్యూ కట్టడంతో పాటు రద్దీగా ఉన్న సమయంలో బంకుల్లో చాలా రకాల మోసాలు జరుగుతుంటాయి. కొన్ని చోట్ల పెట్రోల్ బంకుల్లో పెట్రోల్ తక్కువగా రావడం, రీడింగ్‌లో మోసం, కొలతలో మోసం, నాణ్యత లేని ఇంధనం, ఎక్కువ డబ్బు తీసుకోవడం లాంటి మోసాలు ఇటీవల జరగుతున్నాయి.