విజయనగరం జిల్లా చౌడవాడలో యువతిపై పెట్రోలుతో దాడి చేసిన ఘటన పై ముఖ్యమంత్రి వైస్ జగన్ ఆరా తీశారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్న సీఎం జగన్… ఆ యువతిని మెరుగైన వైద్యం కోసం విశాఖ తరలించాలని ఆదేశించారు.ప్రస్తుతం బాధితురాలు ఆరోగ్యం నిలకడగా ఉందని సీఎంకు తెలిపారు అధికారులు. రాములమ్మ కుటుంబాన్ని పరామర్శించి అండగా నిలబడాలని, అందుతున్న వైద్య సేవలను పర్యవేక్షించాలని మంత్రి బొత్స సత్యన్నారాయణకు ఆదేశించారు సీఎం. అలాగే నిందితుడిపై కఠిన…
నిర్మల్ జిల్లాలో దారుణం చోటుచేసుకొంది. ఉపాధి హామీ అధికారిపై ఓ సర్పంచ్ పెట్రోల్ దాడికి పాల్పడ్డాడు. జిల్లాలోని కుబీర్ మండలంలోని సాంగ్లీ గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకొంది. ఈజీఎస్ కార్యాలయంలో పెండింగ్‌లో ఉన్న బిల్లుల కోసం సర్పంచ్ సాయినాథ్ ఉపాధి హామీ కార్యాలయానికి వచ్చారు. గ్రామంలో గ్రావెల్ వర్క్ విషయమై మాస్టర్ రిజిష్టర్‌లో సంతకం పెట్టాలని టెక్నికల్ అసిస్టెంట్ రాజుపై సర్పంచ్ సాయినాథ్ ఒత్తిడి తీసుకువచ్చాడు. అందుకు రాజు నిరాకరించాడు. దీంతో ముందే పక్కా ప్లాన్ ప్రకారం…