ప్రతీ రోజు పెట్రోల్, డీజిల్‌పై వడ్డిస్తూనే ఉన్నాయి చమురు సంస్థలు.. వరుసగా పెరిగిపోతున్న పెట్రో ధరలు సామాన్యుడికి భారంగా మారుతున్నా.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కనికరించడంలేదు.. చమురు ధరలు ప్రత్యక్షంగా కొన్ని రంగాలపై, పరోక్షంగా అన్ని రంగాలపై ప్రభావం చూపుతూ.. సామాన్యుడికి చుక్కలు చూపిస్తున్నాయి.. రోజుకో కొత్త రికార్డు సృష్టిస్తూ పైపైకి కదులున్న పెట్రో ధరలు.. ఇవాళ కూడా పెరిగాయి.. లీటర్ పెట్రోల్‌పై 35 పైసలు, లీటర్ డీజిల్‌పై 38 పైసలు వడ్డించాయి.. తాజా పెంపుతో దేశరాజధాని…
పెట్రో ధరల మంట సామాన్యుడికి భారంగా మారిపోతోంది.. పెట్రోల్, డీజిల్ ధరలు క్రమంగా పైకి ఎగబాకుతుండడంతో.. నిత్యావసరాలు మొదలు, ఇతర వస్తువలపై కూడా దాని ప్రభావం క్రమంగా పెరుగుతూనే ఉంది. అయితే, పెట్రో ధరలను జీఎస్టీ పరిధిలోకి తెస్తే అందరికీ ఉపశమనం కలుగుతుందనే చర్చ ఎప్పటి నుంచూ జరుగుతూనే ఉంది.. జీఎస్టీ కౌన్సిల్ సమావేశమైన ప్రతీసారి.. ఇక, ఈ సారి.. చమురు ధరలు జీఎస్టీ పరిధిలోకి వస్తాయనే ప్రచారం కూడా సాగుతూ వచ్చింది. అయితే, పెట్రోల్, డీజిల్…
పెట్రోల్, డీజిల్ ధరల బాదుడు కొనసాగుతూనే ఉంది.. దేశ రాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర ఇప్పటికే రూ.105ను క్రాస్ చేయగా.. డీజిల్ ధర రూ.94ను దాటేసింది… చమురు సంస్థలు ఇవాళ మరోసారి పెట్రో ధరలను పెంచాయి.. ఢిల్లీలో లీటర్ పెట్రోల్‌పై 35 పైసలు పెరగగా.. డీజిల్ ధర కూడా 35 పైజలు పెరిగింది.. దీంతో హస్తినలో లీటర్ పెట్రోల్ ధర రూ. 105.49కు చేరగా.. డీజిల్ ధర రూ. 94.22కు ఎగిసింది.. ఇక, ముంబైలో లీటర్…
రోజురోజుకీ పెరుగుతోన్న పెట్రో ధరలు సామాన్యుడికి భారంగా మారుతూనే ఉన్నాయి.. అయినా, చమురు కంపెనీల రోజువారి వడ్డింపు ఆగడం లేదు.. కాస్త బ్రేక్ తర్వాత మళ్లీ పెరుగుతోన్న పెట్రో ధరలు.. వరుసగా ఏడో రోజు కూడా పైకి ఎగబాకాయి.. తాజాగా లీటరు పెట్రోల్‌పై 30 పైసలు, డీజిల్‌పై 35 పైసలు వడ్డించాయి చమురు సంస్థలో దీంతో.. దేశ రాజధాని ఢిల్లీలో చమురు ధరలు ఆల్‌టైం హైకి చేరి కొత్త రికార్డు సృష్టించాయి.. ఢిల్లీలో లీటరు పెట్రోల్ ధర…
ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నో వేదికగా జరిగిన జీఎస్టీ కౌన్సిల్ సమావేశంపై ఎన్నో అంచనాలు పెట్టుకున్నారు దేశ ప్రజలు.. ముఖ్యంగా వరుసగా పెరుగుతూ పోతున్న పెట్రో ధరలకు కళ్లెం పడుతుందని అంతా భావించారు.. పెట్రోలియం ఉత్పత్తి చార్జీలను జీఎస్టీ పరిధిలోకి తెస్తే.. పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా తగ్గిపోతాయని.. దీంతో.. పెట్రో ధరలతో పాటు.. పరోక్షంగా ఇతర వస్తువలపై కూడా ప్రభావం చూపుతుందనుకున్నారు.. కానీ, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన జరిగిన జీఎస్టీ మండలి సమావేశంలో…
భారత్ దృష్టి మొత్తం ఇప్పుడు జీఎస్టీ కౌన్సిల్ సమావేశంపైనే ఉంది… లక్నో వేదికగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన జీఎస్టీ కౌన్సిల్ 45వ సమావేశం ప్రారంభం అయ్యింది.. ఈ సమావేశంలో తెలంగాణ ఆర్థికశాఖ మంత్రి హరీష్‌రావు సహా.. వివిధ రాష్ట్రాలకు చెందిన ఆర్థికమంత్రులు పాల్గొంటున్నారు.. అయితే, ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశాలున్నాయి. 11 రకాల కోవిడ్ ఔషదాలపై పన్ను రాయితీలను పొడిగించే అవకాశం ఉంది.. మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే..…
వరుసగా పెరుగుతూ సామాన్యుడికి మోయలేని భారంగా తయారైన పెట్రో ధరలు.. గత కొన్ని రోజులుగా స్థిరంగా కొనసాగుతున్నాయి.. ఈ మధ్య డీజిల్ ధర ఓసారి తగ్గినా.. దాదాపు 35 రోజుల తర్వత కాస్త ఊరట కల్పిస్తూ ఇవాళ.. పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గాయి.. లీటర్ పెట్రోల్‌పై 20 పైసల మేర తగ్గించిన చమురు సంస్థలు, లీటర్ డీజిల్‌పై 18 పైసలు తగ్గించాయి… దీంతో.. ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.101.64గా, లీటర్ డీజిల్ ధర రూ.89.07కు తగ్గింది.…
పెట్రో ధరలు వరుసగా పెరిగిపోతూనే ఉన్నాయి… పెట్రో భారం ప్రత్యక్ష, పరోక్షంగా ప్రజల నడ్డి విరిస్తూనే ఉంది.. రోజువారీ సమీక్షలో భాగంగా ఇవాళ దేశీయ చమురు కంపెనీలు లీటర్ పెట్రోల్‌పై 30 పైసలు పెంచేశాయి.. దీంతో.. ఢిల్లీలో లీటర్ ప్రెటోల్ ధర రూ.101.84కి చేరగా.. డీజిల్ ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. దేశ రాజధానిలో లీటర్ డీజిల్ ధర రూ.89.87గా ఉంది.. 75 రోజుల్లో 41వ సారి పెట్రో ధరలను వడ్డించాయి చమురు సంస్థలు.. ఢిల్లీ, ముంబై, చెన్నై,…
చమురు కంపెనీలు ఆదివారం మరోసారి పెట్రోల్, డీజిల్ ధరలను పెంచాయి. దీనివల్ల సామాన్యుల ఇబ్బంది మరింత పెరిగింది. క్షీణిస్తున్న ఆదాయం మధ్య సామాన్యులు ఇప్పటికే ద్రవ్యోల్బణంతో పోరాడుతున్నారు. దేశ రాజధానిలో పెట్రోల్ రిటైల్ ధర 35 పైసలు పెరిగి లీటరుకు 99.51 రూపాయలకు చేరుకుంది. అదే సమయంలో, లీటరుకు 18 పైసలు పెరిగిన తరువాత డీజిల్ రూ.89.36కు చేరింది. హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్‌పై 36 పైసలు, డీజిల్‌పై 20 పైసలు పెరగడంతో.. పెట్రోల్ ధర రూ.103.41కు, డీజిల్…
పెట్రో బాదుడు కొనసాగుతూనే ఉంది.. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల సమయంలో.. పెట్రో ధరలకు బ్రేక్ పడింది.. ఇక, ఆ తర్వాత మే 4వ తేదీ నుంచి వరుసగా పెరుగుతూ పోతున్నాయి చమురు ధరలు.. ఇప్పటి వరకు 27 సార్లు వడ్డించాయి చమురు కంపెనీలు.. ఇక, ఇవాళ పెట్రోల్, డీజిల్ ధరలను మరింత పెంచారు.. లీటర్ పెట్రోల్‌పై 27 పైసలు, లీటర్ డీజిల్‌పై 30 పైసల చొప్పున పెంచాయి ఆయిల్ సంస్థలు.. తాజా వడ్డింపుతో కలిపి హైదరాబాద్‌లో…