కరోనా ఎంట్రీతో ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థలు కుప్పకూలాయి. ఇదే సమయంలో వాహనరంగం స్తంభించిపోయింది. ఈ కారణంగాపెట్రో ఉత్పత్తుల వాడకం భారీగా తగ్గింది. బ్యారెల్ చమురు ధరలు కూడా భారీగా పడిపోయాయి. దీంతో ప్రపంచ దేశాల్లో పెట్రో, డీజిల్ ధరలు నేలచూపులు చూశాయి. అయితే భారత్ లో ఇందుకు విరుద్ధంగా పెట్రోల్, డీజిల్ ధరలు ఆకాశాన్ని తాకడం శోచనీయంగా మారింది. గత కాంగ్రెస్ పాలనలో పెట్రోల్ ధరలు రూ.60 రూపాయలు ఉంటే ఇప్పుడది ఏకంగా సెంచరీని దాటేసింది.…
బీజేపీ సర్కారు వరుసగా రెండు సార్లు అధికారంలోకి వచ్చింది. మొదటి ఐదేళ్లలో కమలదళం అనేక సంచలన నిర్ణయాలు తీసుకుంది. ఈ సమయంలో మోదీ ఇమేజ్ భారీగా పెరిగిపోయింది. దీంతో మోదీ సర్కారు రెండోసారి సైతం అధికారంలోకి వచ్చింది. అయితే దేశంలోకి కరోనా ఎంట్రీ ఇచ్చాక మోదీ ప్రతిష్ట క్రమంగా మసకబారుతూ వస్తోంది. కరోనా దెబ్బకు ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థలు కుదేలైపోయాయి.. ఈ నేపథ్యంలోనే ప్రపంచ వ్యాప్తంగా బ్యారెల్ చమురు ధరలు కూడా భారీగా పడిపోయాయి. జనాల…