కేంద్ర పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలో జరిగిన పెసా యాక్ట్ నేషనల్ కాన్ఫరెన్స్‌లో తెలంగాణ తరుఫున మంత్రి సీతక్క పాల్గొన్నారు. పంచాయతీరాజ్ శాఖ మంత్రులు, పంచాయతీరాజ్ ఉన్నతాధికారులు, ట్రైబల్ శాఖ అధికారులు, పెసా యాక్ట్ కోర్దినేటర్లు, ప్రజా ప్రతినిధులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ.. పదిరాష్ట్రాలలో పెసా యాక్ట్ అమలులో ఉందని, పెసా యాక్ట్ అమలులో తెలంగాణలో ఉన్న సమస్యలను ఈ సమావేశం దృష్టికి తీసుకువెళ్ళామన్నారు. పెసా యాక్ట్ ఉన్న గ్రామాల్లో గ్రామ…