రేషన్ బియ్యం మాయం కేసులో పేర్ని జయసుధ విచారణ పూర్తయింది. మాజీ మంత్రి పేర్ని నాని భార్య జయసుధను 2 గంటలపాటు పోలీసులు ప్రశ్నించారు. విచారణలో ఆమె సమాధానాలతో పోలీసులు సంతృప్తి చెందలేదు. మరోసారి నోటీసులు ఇచ్చి విచారించే ఛాన్స్ ఉన్నట్లు సమాచారం. కాగా.. విచారణలో పోలీసులు 45 ప్రశ్నలు అడిగారు. గోడౌన్ నిర్వహణ అంతా మేనేజర్ మానస తేజ చూస్తారని ఆమె చెప్పింది
మాజీ మంత్రి పేర్ని నాని భార్య జయసుధకు మచిలీపట్నం కోర్టులో ఊరట దక్కింది.. అయితే, ఇదే సమయంలో.. విచారణకు సహకరించాలంటూ స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది కోర్టు.. రేషన్ బియ్యం మాయం కేసులో పేర్ని నాని భార్య జయసుధ మచిలీపట్నం కోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేసిన విషయం విదితమే కాగా.. గత వారం విచారణ ముగించిన జిల్లా కోర్టు.. విచారణను వాయిదా వేసిన విషయం విదితమే.. అయితే, బియ్యం మాయం కేసులో ఏ1గా ఉన్న…
పేర్ని నాని భార్య కేసులో ఏ1 జయసుధ తరఫు న్యాయవాదులు తమ వాదన వినిపిస్తూ.. గోడౌన్‌లో బస్తాల షార్టేజ్ వచ్చినట్లు గుర్తించి.. నవంబర్ 27వ తేదీన ప్రభుత్వానికి లేఖ రాశామన్నారు.. అయితే, డిసెంబర్ 3, 4 తేదీల్లో గోడౌన్లో తనిఖీలు నిర్వహించి.. 10వ తేదీన డిమాండ్ నోటీసు ఇచ్చారని కోర్టుకు వివరించారు. అనంతరం డిసెంబర్ 12వ తేదీన కేసు నమోదు చేశారని కోర్టుకు విన్నవించారు. బియ్యం తగ్గిన విషయం తామే ముందు గుర్తించి ప్రభుత్వానికి చెప్పామని తెలిపారు..