అధినేత ఆదేశించారు. అక్కడి నేతలు ఊ కొట్టారు. కలిసి అడుగులు వేస్తామని మాట ఇచ్చేశారు కూడా. కానీ.. వారి మధ్య నమ్మకం మిస్ అయ్యిందట. కుమ్ములాటలకు చెక్ పెట్టలేకపోతున్నారా? ఐక్యంగా పని చేసే పరిస్థితి లేదా? అధికార వైసీపీకి కొరుకుడుపడని ఆ నియోజకవర్గం ఏంటి? టెక్కలిలో ఏదో ఒక మూల అనైక్యత శ్రీకాకుళం జిల్లా టెక్కలి. గత ఎన్నికల్లో వైసీపీ ఎన్ని ప్రయోగాలు చేసినా.. ఇక్కడ టీడీపీనే గెలిచింది. ఈ నియోజకవర్గంలో వైసీపీ నాయకులు ఎక్కువగా ఉన్నా……
ఒకే ఒరలో రెండు కత్తులు ఇమడవు. స్వపక్షంలో విపక్షంగా ఉన్న ఆ ఇద్దరు నేతలకు ఈ సామెత వర్తిస్తుంది. అధిష్ఠానం మందలించినా.. అగ్రనేతలు అదిలించినా వారి పంథా ఒక్కటే. పదవులు కట్టబెట్టినా అదేపట్టు.. అదేబెట్టు. ఒకరికొకరు డీ అంటే డీ అని కాలు దువ్వుతున్నారు. ఇంతకీ ఎవరా నాయకులు? ఏమా కథ? కత్తులు దూసుకుంటున్నారు.. కాలు దువ్వుతున్నారు..!శ్రీకాకుళం జిల్లా టెక్కలి నియెజకవర్గంలో అధికార వైసీపీ నేతలు దువ్వాడ శ్రీనివాస్.. పేరాడ తిలక్‌ల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది.…