దేశ వ్యాప్తంగా ఎండలు దంచికొడుతున్నాయి. అనేక రాష్ట్రాల్లో 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. భానుడి ప్రతాపానికి జనాలు ఇళ్ల నుంచి బయటికి రావాలంటేనే జంకుతున్నారు. ఉదయం 9 నుంచే ఎండలు మండిపోతున్నాయి. ఎండల తీవ్రతతో జనాలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పగటిపూట ఉష్ణోగ్రతలు పెరిగిపోతుండటంతో జనాలు సతమతమవుతున్నారు. అయితే ఎండల ప్రభావం మనుషులపైనే కాకుండా రైలు పట్టాలపై ప్రభావం చూపింది. ఎండల వేడిమికి రైలు పట్టాలే కరిగిపోయాయి.