ప్రముఖ మలయాళ నటుడు, దర్శకుడు పృథ్వీరాజ్ లక్షద్వీప్ వాసుల కోసం గొంతెత్తాడు. తన సోషల్ మీడియా అక్కౌంట్ ద్వారా అక్కడి ప్రజల మనోభావాలను ప్రపంచానికి తెలియచేసే ప్రయత్నం చేశాడు. అరేబియా సముద్రంలోని లక్షద్వీప్ యూనియన్ టెర్రీటరీ. అక్కడ ఎంపీగా ఎన్సీపీకి చెందిన మహ్మద్ ఫైజల్ ఎన్నికయ్యారు. అడ్మినిస్ట్రేటర్ గా బీజేపీకి చెందిన ప్రఫుల్ పటేల్ నియమితులయ్యారు. అయితే ఇటీవల లక్ష్యద్వీప్ లో అధికారులు తీసుకొచ్చిన కొత్త సంస్కరణలపై స్థానికులు పెదవి విరుస్తున్నారు. నేరాలు జరగని ప్రాంతంలో అధికారులు…