దేశంలో ఎక్కడ చూసినా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో దేశం మొత్తం అతలాకుతలమైంది. ఉత్తరాఖాండ్ లోని డ్రెహ్రడూన్ లో గతంలో లేని విధంగా వర్షాలు కురుస్తున్నాయి. చమోలి, రుద్ర ప్రయాగ జిల్లాల్లో క్లౌడ్ బరస్ట్ జరిగింది. దీంతో వరదలు వచ్చి గ్రామాలన్ని నీట మునిగాయి. భారీ వర్షాలతో ఉత్తరాఖాండ్ మొత్తం విలవిలాడిపోతుంది. ఎటు చూసినా వరదలు, కొట్టుకుపోయిన గ్రామాలు, లోయలను తలపిస్తున్న రోడ్డు కనిపిస్తున్నాయి. వరదలు పోటెత్తడంతో గ్రామాలకు గ్రామాలు కొట్టుకుని పోతున్నాయి.…