తెలుగు చిత్రసీమలో దర్శకత్వంతో పాటు సంగీతం సమకూర్చిన వారూ ఉన్నారు. ఇక నిర్మాణంతో కూడా స్వరాలు పలికించి రంజింప చేసిన వారు అరుదనే చెప్పాలి. వారిలో అగ్రస్థానంలో నిలుస్తారు పెనుపాత్రుని ఆదినారాయణ రావు. ఆదినారాయణరావు నిర్మాతగా మారకపోయి ఉంటే, మరింత మధురాతి మధురమైన సంగీతం మన సొంతమయ్యేదని సంగీతప్రియులు అంటారు. ఆయన బాణీల్లో అంతటి మహత్తుండేది మరి. తన భార్య నటి అంజలీదేవి పేరుమీద ‘అంజలీ పిక్చర్స్’ సంస్థనూ స్థాపించి మరపురాని చిత్రాలను నిర్మించారు ఆదినారాయణరావు. ఆదినారాయణరావు…
(ఆగస్టు 21న పి.ఆదినారాయణరావు జయంతి) సంగీత దర్శకుడు, నిర్మాత ఆదినారాయణరావు తెలుగు చిత్రసీమలో తనదైన బాణీ పలికించారు. స్వరకల్పనలో వినసొంపైన రాగాలు కూర్చి జనం మదిని దోచారు. అభిరుచిగల నిర్మాతగా అనేక మరపురాని చిత్రాలను ప్రేక్షకులకు అందించారు. ఆదినారాయణరావు నిర్మాత కాకపోయివుంటే మరింత మధురం తెలుగువారి సొంతం అయ్యేదని ఎందరో సంగీతప్రియులు అంటూ ఉంటారు. మాటలతోనే ఆరంభించి, పాటకు రాగం సమకూర్చడంలోనూ, పాటల్లోని పదాలను వీనులకు విందు చేసేలా విరచి, తన స్వరవిన్యాసాలతో అమృతం అద్దడంలోనూ ఆదినారాయణ…