విశాఖలో అర్థరాత్రి రెచ్చిపోయారు దొంగలు.. పెందుర్తి చీమలాపల్లిలో అర్ధరాత్రి సమయంలో ఓ ఇంట్లోకి చొరబడ్డ దొంగలు.. అందినకాడికి దోచుకున్నారు.. కిటికీ తొలగించి ఇంట్లోకి చొరబడ్డారు ఇద్దరు దొంగలు.. ఈ సమయంలో ఇంట్లో మొత్తం ముగ్గురు వ్యక్తులు ఉన్నట్టుగా తెలుస్తోంది.. ఇంట్లో నిద్రిస్తున్న సుమారు 25 సంవత్సరాల మహిళను వారు తెచ్చుకున్న స్క్రూడ్రైవర్‌తో పొడిచి తీవ్రగాయాలు చేశారు.. ఇక, అత్త మామ నిద్రిస్తున్న రూమ్‌కు బయటనుంచి గడియ పెట్టి పరారయ్యారు దొంగలు.. అయితే, దొంగల ప్రయత్నాన్ని సదరు మహిళ…
ఒకసారి పదవి రుచిచూస్తే.. తేలిగ్గా వదిలి పెట్టలేరు. ఓడినా పైచెయ్యి సాధించాలని చూస్తారు నాయకులు. ఆ జిల్లాలో రాజకీయ నిరుద్యోగులుగా మారిన కొందరు మాజీ ఎమ్మెల్యేలు ఆ పనే చేస్తున్నారట. సిట్టింగ్‌ల కుర్చీల కిందకు నీళ్లను తెస్తున్నట్టు టాక్. ఇంతకీ ఎవరా మాజీలు? ఏమా కథా? ఉమ్మడి విశాఖజిల్లాను కంచుకోటగా మలుచుకుంటోంది వైసీపీ. ఇక్కడ అధికారపార్టీకి 12మంది ఎమ్మెల్యేల బలం ఉండగా.. అదేస్ధాయిలో మాజీ ఎమ్మెల్యేల నాయకత్వం కనిపిస్తోంది. వచ్చే ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చెయ్యడం ద్వారా…
ఉమ్మడి విశాఖ జిల్లాలో కీలకమైన నియోజకవర్గాల్లో పెందుర్తి ఒకటి. అర్బన్, గ్రామీణ ప్రాంతాల కలబోత కావడంతో ఇక్కడి రాజకీయాలు ఎప్పుడూ ఆసక్తికరమే. ప్రధాన పార్టీల ఫోకస్ కూడా ఎక్కువే. ఇక్కడ ఒకసారి గెలిచిన ఎమ్మెల్యే.. తర్వాత ఎన్నికల్లో గెలవకపోవడం పెందుర్తి సెంటిమెంట్. 2019లో ఈ సీటును వైసీపీ గెలుచుకోగా.. స్థానిక సంస్థల ఎన్నికల నాటికి టీడీపీ పుంజుకుంది. ఇప్పుడు మళ్లీ ఎలక్షన్ మూడ్ వచ్చేసింది. పెందుర్తిపై పట్టుకోసం వైసీపీ, టీడీపీ వేయని ఎత్తుగడలు లేవు. అయితే ప్రతిపక్ష…
ఆయనో ఫస్ట్ టైమ్ ఎమ్మెల్యే. రాజకీయాలకు పాతే అయినా వయసు, సీనియారిటీ తక్కువ. దీంతో సీనియర్ నేతలే అక్కడ చక్రం చక్రం తిప్పుతూ.. ఎమ్మెల్యేకు చుక్కలు చూపిస్తున్నారట. ఇంకేముందీ హైకమాండ్ నుంచి ఎమ్మెల్యేకు ఒక్కటే అక్షింతలు. ఈ పంచాయితీనే ఆ నియోజకవర్గంలో వైసీపీ రాజకీయాలను వేడెక్కిస్తోంది. పెందుర్తిలో ల్యాండ్ రాజకీయాలు ఎక్కువ..! గ్రేటర్ విశాఖ పరిధిలో అత్యధిక ల్యాండ్ బ్యాంక్ ఉన్న నియోజకవర్గం పెందుర్తి. ఇక్కడ ప్రభుత్వ, పోరంబోకు భూములు ఎక్కువ. సబ్బవరం ఎడ్యుకేషనల్ హబ్‌గా.. పరవాడ…
ఆయన ఎమ్మెల్యేగా గెలిచింది ఒక్కసారే. పదవి తెచ్చిన వన్నెకంటే కాంట్రవర్సీతో వచ్చిన గుర్తింపే ఎక్కువ. అలాంటి నాయకుడిని ఓ మాజీ మంత్రితో జతకట్టించింది అధిష్ఠానం. కలిసి కాపురమైతే చేశారు కానీ ఎవరి కుంపట్లు వారివే. ఇప్పుడు ఆ ఇద్దరూ టికెట్ నాదంటే నాదని పోటీ పడుతున్నారట. ఆలస్యం చేస్తే మొదటికే మోసం వస్తుందని గుర్తించిన హైకమాండ్ మధ్యేమార్గం నిర్ధేశించిందని టాక్. ఇంతకీ ఎవరా నేతలు? ఏమా కాంట్రవర్సీ? పెందుర్తి టికెట్ కోసం కోల్డ్‌వార్..! మాజీ మంత్రి బండారు…
ఆ నియోజకవర్గంలో ఒకసారి నెగ్గినవాళ్లు మరోసారి గెలిచింది లేదు. దానికి తగ్గట్టు ఎమ్మెల్యేగా బ్రహ్మాండంగా ఓట్లేసి గెలిపించిన జనం స్థానిక ఎన్నికల్లోనే గట్టి షాక్ ఇచ్చారు. ఇంకేం ఉంది.. సదరు ఎమ్మెల్యేగారికి చెమటలు పట్టేశాయి. అంతా బాగుందని ఇంట్లో కూర్చుంటే మాజీ అయిపోతామని భయం పట్టుకుంది. ఎన్నికలు ఎప్పుడైనా రానివ్వండి నేను మాత్రం జనంలోనే ఉంటున్నారట. ఆయనెవరో ఈ స్టోరీలో చూద్దాం. జనం బాట పట్టేందుకు శ్రావణ మాసాన్ని ఎంచుకున్నారు! విశాఖజిల్లా పెందుర్తి రాజకీయ చైతన్యానికి మారుపేరు.…