Harish Rao : మాజీ మంత్రి హరీష్ రావు రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. సీఎం రేవంత్ రెడ్డి చేసిన ప్రకటనలు ఘనంగా ఉన్నప్పటికీ ఆచరణలో మాత్రం శూన్యం అని ఆయన అన్నారు. “గాలి మాటలతో ప్రజలను ఎంతకాలం మోసం చేస్తారు?” అని హరీష్ రావు ప్రశ్నించారు. ప్రభుత్వ పాఠశాలల్లో పారిశుద్ధ్య నిర్వహణ కోసం నియమించిన స్కావెంజర్లకు 9 నెలలుగా వేతనాలు చెల్లించకపోవడం సిగ్గుమాలిన చర్య అని హరీష్ రావు పేర్కొన్నారు. చిన్న ఉద్యోగుల…
Gambhiraopet: రాజన్న సిరిసిల్ల జిల్లాలో పారిశుద్ధ కార్మికులు తమ న్యాయమైన హక్కుల కోసం రోడ్డెక్కారు. గంభీరావుపేట మండల కేంద్రంలో మేజర్ గ్రామపంచాయతీ కార్మికులు నాలుగు నెలలుగా పెండింగ్‌లో ఉన్న జీతాల చెల్లింపుల కోసం బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. కామారెడ్డి – సిద్దిపేట ప్రధాన రహదారిపై సుమారు గంటపాటు కార్మికులు ధర్నా చేయడంతో ట్రాఫిక్‌కు అంతరాయం కలిగింది. కార్మికులు తమ ఆవేదనను వ్యక్తం చేస్తూ.. నాలుగు నెలలుగా జీతాలు రాకపోవడంతో కుటుంబాల పోషణ భారంగా మారిందని వాపోయారు.…