Teppa Samudram: సింగర్ కమ్ లిరిసిస్ట్ పెంచల్ దాస్ గురించి తెలుగువారికి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. అరవింద సమేతలో రెడ్డమ్మ తల్లి అని ఏడిపించినా.. శ్రీకారం సినిమాలో భలేగుంది బాలా అంటూ అమ్మాయిని ఆటపట్టించినా.. కృష్ణార్జున యుద్ధంలో దారి చూడు దుమ్ము చూడు మామ అంటూ హుషారెత్తించినా.. పెంచల్ దాస్ కె చెల్లింది. ఎన్నో పాటలు ఆయన చేతినుంచి జాలువారాయి..
గాయకుడు పెంచల్ దాస్ పాడింది తక్కువ పాటలే అయినా అభిమానుల మనసుల్లో బలమైన ముద్ర వేశాడు. కృష్ణార్జున యుద్ధం సినిమాలో ‘దారిచూడు దుమ్ముచూడు’.. శ్రీకారం సినిమాలో ‘వచ్చానంటివో పోతానంటివో’ వంటి పాటలతో మంచి గుర్తింపుపొందాడు. ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్-రానా దగ్గుబాటి సినిమాలో పెంచల్ దాస్ ఫోక్ సాంగ్ పాడనున్నట్లు తెలుస్తోంది. మొదట పవన్ కళ్యాణ్ పాడతాడనే ప్రచారం జరుగగా.. తాజాగా పెంచల్ దాస్ పేరు వినబడుతోంది. సినిమా ద్వితీయార్థంలో వచ్చే ఓ నేపథ్యగీతాన్ని పెంచలదాస్…