Pele Death: ప్రముఖ ఫుట్‌బాల్ దిగ్గజం, బ్రెజిల్ మాజీ ఆటగాడు పీలే (82) మృతిచెందారు. కొంతకాలంగా క్యాన్సర్‌తో బాధపడుతున్న ఆయన సావో పాలోలోని ఐన్‌స్టీన్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గురువారం రాత్రి కన్నుమూసినట్లు వైద్యులు వెల్లడించారు. ఆయన మరణంతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఫుట్‌బాల్ అభిమానులు శోకసంద్రంలో మునిగిపోయారు. పీలే బ్రెజిల్‌కు మూడుసార్లు ప్రపంచకప్ అందించారు. 1958, 1962, 1970లలో ఫిఫా ప్రపంచ కప్‌ను మూడుసార్లు గెలిపించిన ఏకైక ఆటగాడు పీలే. ఆయన బ్రెజిల్ తరఫున 92 అంతర్జాతీయ…