టాలీవుడ్ లో చిన్న సినిమాల పరిస్థితి ఏమంత ఆశాజనకంగా లేదు. ఏవో పెద్ద బ్యానర్ సపోర్ట్ ఉంటె రిలీజ్ సమయంలో థియేటర్లు దొరుకుతాయి తప్ప, చిన్న నిర్మాతలకు థియేటర్లు దొరికే పరిస్థితి ఉండదు.మరో వైపు ఒక్కోసారి సినిమా బాగున్నా కూడా ప్రేక్షకులు థియేటర్లకు రాని పరిస్థితి. అందుకు కారణం లేకపోలేదు. చిన్న సినిమాలకు హిట్ టాక్ వచ్చి, మౌత్ టాక్ బాగుంటే తప్ప కలెక్షన్లు రావు. మల్టీప్లెక్స్ లో చిన్న సినిమాలకు టికెట్ ధర కూడా 175రూపాయలు…