రోజురోజుకు తాగుబోతుల వికృత చేష్టలు శృతిమించుతున్నాయి. విమానంలోనైనా, రైలులోనైనా విచక్షణ లేకుండా తాగిన మత్తులో ప్రయాణికులను ఇబ్బందులకు గురి చేస్తున్నారు. తాజాగా అమృత్ సర్ నుంచి కోల్‌కతా వెళ్తున్న రైలులో ఓ ట్రివెల్ టికెట్ ఎక్జామినర్ ( టికెట్ చెకర్ ) తాగిన మత్తులో ఓ మహిళపై మూత్ర విసర్జన చేశాడు.
Air India modifies in-flight alcohol service policy: ఇటీవల ఎయిరిండియా విమానంలో జరిగిన మూత్రవిసర్జన సంఘటన దేశ ఏమియేషన్ రంగంలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. శంకర్ మిశ్రా అనే వ్యక్తి మద్యం సేవించి ఓ సీనియర్ మహిళా ప్రయాణికురాలిపై మూత్రవిసర్జన చేశాడు. దీంతో ఈ ఘటనపై డీజీసీఏ కీలక ఆదేశాలు జారీచేసింది. విమానంలో ప్రయాణికులు వికృత చర్యలపై ఎలాంటి చర్యలు తీసుకోవాలనేదానిపై మార్గదర్శకాలు విడుదల చేసింది.