Peace talks between Assam-Meghalaya: అస్సాం- మేఘాలయ సరిహద్దుల్లో భారీగా హింస జరగడంతో అస్సాం ఫారెస్ట్ గార్డుతో సహా మొత్తం ఆరుగురు మరణించారు. కలప స్మగ్లింగ్ వివాదం రెండు రాష్ట్రాల మధ్య సరిహద్దు హింసకు దారి తీసింది. ప్రస్తుతం పశ్చిమ కర్బీ అంగ్లాంగ్ జిల్లాకు సమీపంలో ఉన్న మేఘాలయ, అస్సాం సరిహద్దు గ్రామం అయిన ఉమ్లాపర్ వద్ద అస్సాం పోలీసులు నిఘాపెంచారు. ఇదిలా ఉంటే అస్సాం పెట్రోలియం కార్మికులు మేఘాలయకు ఇంధన రవాణా నిలిపివేస్తునట్లు ప్రకటించారు. అస్సాం…