రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ముగింపు దశకు చేరుకుంది. ఉక్రెయిన్‌పై మూడు వారాలుగా దండయాత్ర కొనసాగిస్తున్న రష్యాకు అంతర్జాతీయ న్యాయస్థానం కీలక ఆదేశాలు జారీచేసింది. ఉక్రెయిన్‌పై సైనిక ఆపరేషన్‌ను వెంటనే నిలిపివేయాలని సూచించింది. ఉక్రెయిన్‌పై దాడులు నిలిపివేసి.. ఆ దేశ భూభాగం నుంచి రష్యా తన భద్రతా బలగాలను ఉపసంహరించుకోవాలని ఆదేశించింది. ఉక్రెయిన్ భూభాగంపై ఇక నుంచి రష్యా సేనలు గానీ, దానికి మద్దతిచ్చే సాయుధ బృందాలు గానీ ఎలాంటి చర్యలకు పాల్పడరాదని హెచ్చరించింది. రష్యాపై అంతర్జాతీయ న్యాయస్థానంలో వేసిన…