మాదాపూర్ సున్నం చెరువులోని ఆక్రమణలను వద్ద హైడ్రా కూల్చివేతలు ప్రారంభించింది. సున్నం చెరువు పరిధిలో అక్రమంగా వెలిసిన గుడిసెలను హైడ్రా సిబ్బంది తొలగిస్తున్నారు. భారీ బందోబస్తు నడుమ కూల్చివేతలు కొనసాగుతున్నాయి. చెరువు ఎఫ్ టి ఎల్ పరిధిలో అక్రమంగా నిర్మించిన గుడిసెలను తొలగించేస్తున్నారు. చెవుల పునరుద్ధరణలో భాగంగా రూ. 10 కోట్లతో సున్నం చెరువును హైడ్రా అభివృద్ధి చేస్తోంది. 32 ఎకరాల విస్తీర్ణంలోని సున్నం చెరువులో భారీగా ఆక్రమణలు వెలుగుచూశాయి. చెరువు సమీపంలో అక్రమంగా వేసిన బోరు…
మాదాపూర్లోని సున్నం చెరువు చెంత బోర్లు వేసి.. ఆ నీటితో ప్రజల ఆరోగ్యానికి కన్నం పెడుతున్నారు ఇక్కడి నీటి వ్యాపారులు. అక్రమంగా బోర్లు వేసి.. కలుషిత జలాలతో మాదాపూర్ పరిసరాల్లో ఉన్న హాస్ట ళ్ల విద్యార్థుల భవిష్యత్ను అనారోగ్యం పాలు చేస్తున్నారు. ఐఐటీతో పాటు.. వైద్య విద్యనభ్యశించడానికి ఉత్తమ ర్యాంకులు రావాలని ఆశిస్తూ అహర్నిశలూ కష్టపడుతున్న విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడుతున్నారు. సున్నం చెరువు చెంతకు వెళ్తేనే దుర్వాసన భరించలేం. ఇలాంటి చోట బోర్లు వేసి ఆ…