ఎమ్మెల్యే రేగా కాంతారావు.. మాజీ ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు. ఇద్దరిదీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక నియోజకవర్గమే అడ్డా. అధికారపార్టీలో ఇద్దరూ వలస నాయకులే. 2018 ఎన్నికల్లో పినపాకలో కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచి తర్వాత కారు ఎక్కేశారు రేగా కాంతారావు. ఆ ఎన్నికల్లో టీఆర్ఎస్ నుంచి పోటీ చేసి ఓడిపోయారు పాయం వెంకటేశ్వర్లు. అంతకుముందు జరిగిన 2014 ఎన్నికల్లో వైసీపీ నుంచి గెలిచి గులాబీ కండువా కప్పుకొన్నారు పాయం. మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి అనుచరుడు.…
ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా టీఆర్‌ఎస్‌లోని కొందరు నేతలకు సీటు భయం పట్టుకుంది. పార్టీ ఫిరాయించేందుకు ఇప్పటి నుంచే జాగ్రత్త పడుతున్నారు నాయకులు. గత ఎన్నికల్లో టీఆర్ఎస్ నుంచి పోటీ చేసి ఓడిన నేతలు ప్రస్తుతం టీఆర్‌ఎస్‌లోనే ఉండిపోయారు. అలాంటి వారంతా భవిష్యత్‌పై బెంగ పెట్టుకుని పక్క పార్టీలో బిస్తర్ వేసుకుంటున్నారు. గతంలో అశ్వారావుపేట నుంచి పోటీ చేసిన ఓడిన తాటి వెంకటేశ్వరరావు టీఆర్‌ఎస్‌కు గుడ్‌బై చెప్పి కాంగ్రెస్ కండువా కప్పేసుకున్నారు. ఇదే బాటలో మరికొందరు ఉన్నట్టు…
ప్రస్తుతం ఎన్నికలు అంటేనే డబ్బు, మద్యం.. ఆపై సామాజికంగా విభజించి ఓట్లను కొనేయడమే అన్న చందంగా మారాయి. ఎన్నికల కమీషన్ ఎంత చైతన్య పరుస్తున్న మార్పు కనిపించడం లేదు. కఠినమైన చట్టాలు వున్నా శిక్ష పడట్లేదు అనేది సగటు ఓటరు ఆవేదన.. అయితే తాజాగా ఓ ఎన్నికల్లో డబ్బులు పంచిన మాజీ ఎమ్మెల్యేకు జైలు శిక్ష ఖరారు చేసింది కోర్టు..వివరాల్లోకి వెళ్తే, పినపాక మాజీ ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లుకు కోర్టు జైలు శిక్ష విధించింది. ఎన్నికల్లో డబ్బులు…