ఆన్-డిమాండ్ స్ట్రీమింగ్ దిగ్గజం అమెజాన్ ప్రైమ్ వీడియో.. వచ్చే రెండేళ్లలో ఒరిజినల్ షోలు, సినిమాలు మరియు కో-ప్రొడక్షన్‌లలో హిందీ, తమిళంతో పాటు తెలుగులో 40 కొత్త టైటిల్స్‌ను విడుదల చేయనున్నట్లు గురువారం తెలిపింది. భారతదేశంలో ఐదేళ్లు పూర్తి చేసుకున్న ఈ కంపెనీ, దేశంలోని ప్రైమ్ వీడియో స్టోర్‌తో పే-పర్-వ్యూ మూవీ సర్వీస్‌లోకి అడుగుపెడుతున్నట్లు, అలాగే రానున్న సంవత్సరాల లైసెన్సింగ్, ఒప్పందాలు మరియు వివిధ భారతీయ స్టూడియోలతో కో-ప్రొడక్షన్‌లను ప్రకటించింది. అమెజాన్ ప్రైమ్ వీడియో హిందీ, తెలుగులో చిత్రాలతో…
కరోనాతో ఎంటర్ టైన్ మెంట్ ఇండస్ట్రీ ముఖ చిత్రమే మారిపోయింది. కరోనా తొలి వేవ్ లోనే థియేటర్లు లేక ఓటీటీల వైపు మొగ్గుచూపారు ప్రేక్షకులు. దాంతో పలువురు దర్శకనిర్మాతలు తమ చిత్రాలను డైరెక్ట్ గా ఓటీటీలలో విడుదల చేయటానికి సిద్ధమై పోయారు. వాటిలో కొన్నింటికి ఆదరణ దక్కినా మెజారిటీ సినిమాలకు మాత్రం చుక్కెదురైంది. ఇక కొన్ని సినిమాలు పే ఫర్ వ్యూ పద్ధతితో ఆడియన్స్ ముందుకు వచ్చాయి. అయితే స్టార్ హీరోల సినిమాలు ఏవీ అలా రిలీజ్…