కోనసీమలో జరిగిన సంఘటన చాలా సున్నితమయిన అంశం అన్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. మీడియాతో పవన్ కళ్యాణ్ చిట్ చాట్ నిర్వహించారు. కోనసీమలో తాజా పరిస్థితేంటని మీడియా ప్రతినిధులను ఆరా తీశారు పవన్. మంత్రి పినిపె విశ్వరూప్ కూడా బాధితుడేనంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. కోనసీమ ఎపిసోడ్ సెన్సిటివ్‌గా ఉందనే విషయాన్ని కేంద్ర నిఘా విభాగం ముందుగానే అలెర్ట్ చేసింది. అయినా ప్రభుత్వం అంతగా పట్టించుకోలేదన్నారు. కేంద్రం అలెర్ట్ చేసినా.. రాష్ట్ర ప్రభుత్వం స్పందించ లేదని…
మెగాస్టార్ చిరంజీవి పొలిటికల్ ఎంట్రీ గురించి అందరికి తెలిసిందే.. అభిమానుల కోరిక మేరకు ప్రజారాజ్యం అనే కొత్త పార్టీ పెట్టి రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చాడు. అయితే అనూహ్య పరిణామాలలో చిరు రాజకీయాలలో ఓటమి పాలయ్యారు. ఇక ఆ తరువాత రాజకీయాలు మనకు సరిపోవు అని సినిమాలకే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం మొదలుపెట్టాడు. ఇక అన్న బాటలోనే తమ్ముడు పవన్ కళ్యాణ్ కూడా జనసేన పార్టీని ప్రారంభించి విజయం కోసం ఎదురుచూస్తున్నాడు. చిరు లా కాకుండా పవన్ మాత్రం…
ఆత్మకూరు ఉప-ఎన్నికల నుంచి టీడీపీ తప్పుకున్న నేపథ్యంలో.. సత్తా చాటేందుకు వైసీపీ, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు పోటీ పడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే తాము జనసేన – బీజేపీ బలపరిచిన అభ్యర్థిని రంగంలోకి దింపుతామని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి అన్నారు. ఇదే సమయంలో వైసీపీ ప్రభుత్వం, టీడీపీల మీద తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. 5 లక్షల ఆదాయమున్న దేవాలయాల హక్కు యాజమాన్యాలదే అని స్వయంగా హైకోర్టు ఆర్డర్ ఇచ్చినప్పుడు.. దేవాలయాల ఆస్తులపై ప్రభుత్వానిదే…
భారత చిత్రసీమలో ఇప్పుడున్న మోస్ట్ హ్యాపెనింగ్ బ్యూటీస్‌లో పూజా హెగ్డే ఒకరు. అనతి కాలంలోనే పాన్ ఇండియా నటిగా అవతరించిన ఈమెకు.. వరుసగా క్రేజీ ఆఫర్లు వచ్చిపడుతున్నాయి. పైగా.. ఈమె పట్టిన ప్రతీ ప్రాజెక్టూ హిట్టేనని టాక్ ఉండడంతో, ఈమెనే ప్రధానంగా తమ సినిమాల్లో తీసుకోవాలని ఫిల్మ్ మేకర్స్ ఎగబడుతున్నారు. కొందరు ఆమెను లక్కీ చార్మ్‌గా భావించి, రిపీటెడ్‌గా తమ సినిమాల్లో తీసుకుంటున్నారు కూడా! అలాంటి ఫిల్మ్ మేకర్స్‌లో హరీశ్ శంకర్ ఒకరు. పూజాతో కలిసి చేసిన…
‘కేకే’ సుపరిచితుడైన ప్రముఖ గాయకుడు శ్రీ కృష్ణకుమార్ కున్నత్ మృతిపై పవన్ కళ్యాణ్ సంతాపం ప్రకటించారు. ఆయన అకాల మరనం తనను బాధించిందన్నారు. సినీ సంగీత ప్రపంచంలో తనకంటూ ప్రత్యేక బాణీని కలిగిన కేకే ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నానన్నారు. తన సినిమాల్లో ఆయన ఆలపించిన గీతాలు.. అభిమానులతో పాటు సంగీత ప్రియుల్ని మెప్పించాయన్నారు. ఖుషీ సినిమాలోని ‘ఏ మేరా జహా’ పాట అన్ని వయసుల వారికి చేరువైందని.. అందుకు కేకే గాత్రమే ప్రధాన కారణమని…
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వచ్చే ఎన్నికల్లో తిరుపతి నుంచి పోటీ చేస్తారని సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. గత ఎన్నికల్లో భీమవరం, గాజువాక నుంచి పవన్ పోటీ చేశారు. అయితే రెండు స్థానాల్లోనూ ఆయన ఓటమి పాలయ్యారు. ముఖ్యంగా సినిమా అభిమానాన్ని ఓట్ల రూపంలోకి ఆయన మలుచుకోలేక చతకిలపడ్డారు. అందుకే వచ్చే ఎన్నికల్లో కొత్త స్థానం నుంచి పోటీ చేయాలని పవన్ నిర్ణయించుకున్నారని టాక్ నడుస్తోంది. MP Guru Murthy: తిరుపతి రైల్వేస్టేషన్ కొత్త…
బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్, అలియా భట్ జంటగా ఆయన ముఖర్జీ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం బ్రహ్మాస్త్ర. ప ఇండియా లెవల్లో అన్ని భాషల్లోనూ రిలీజ్ అవుతున్న ఈ సినిమాను బాలీవుడ్ బడా నిర్మాత కరణ్ జోహార్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమాకు తెలుగులో దర్శక ధీరుడు రాజమౌళి సమర్పకుడిగా వ్యవహరిస్తుండడం విశేషం. ఇక ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, సాంగ్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక ఈ చిత్రంలో అమితాబ్…
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ త్వరలో ఏపీ డీజీపీ రాజేంద్రనాథ్‌రెడ్డిని కలవనున్నారు. ఏపీలో జనసేన శ్రేణులపై అక్రమ కేసులు బనాయిస్తున్నారనే అంశాన్ని ఆయన డీజీపీ దృష్టికి తీసుకువెళ్లనున్నారు. ఇటీవల కోనసీమ అల్లర్ల కేసులో పలువురు జనసేన నేతల పేర్లను పోలీసులు ఛార్జిషీట్లో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో జనసేన నాయకులు, కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయించడం, వేధింపులకు గురిచేస్తున్న తీరుపై పవన్ కళ్యాణ్ నేతృత్వంలోని బృందం డీజీపీ రాజేంద్రనాథ్‌రెడ్డితో చర్చించాలని పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ నిర్ణయించిందని జనసేన…
సోషల్ మీడియా పెరిగిన తర్వాత రోజూ పలు రకాల గాసిప్స్ వినిపిస్తూనే ఉంటాయి. ఇక టాలీవుడ్ లో రకరకాల కాంబినేషన్స్ లో సినిమా అంటూ రూమర్స్ వింటూనే ఉన్నాం. అయితే వాటిలో కొన్ని కార్యరూపం దాల్చిన సందర్భాలు లేకపోలేదు. ఎక్కువగా ఈ రూమర్స్ చెవులను తాకి వెళ్ళిపోతుంటాయి. అలాంటి రూమర్ ఒకటి ప్రస్తుతం నెట్టింట హల్ చల్ చేస్తోంది. ఇండియాస్ మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్ రాజమౌళి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కలయికలో సినిమా అన్నదే ఆ…
పల్నాడు జిల్లా రెంటచింతలలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పందించారు. ఈ సంఘటన చాలా బాధాకరమని అన్నారు. ఈ ప్రమాదంలో ఏడుగురు మృతి చెందారని తెలిసి తాను తీవ్ర విచారానికి లోనైనట్టు తెలిపారు. శ్రీశైలం దర్శనానికి వెళ్లి వస్తున్న వీరు ప్రమాదవశాత్తు చనిపోవడం తనను కలిచివేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు పవన్ కళ్యాణ్ తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. రోజూవారీ కూలీపై ఆధారపడి జీవించే వారి కుటుంబాలను ప్రభుత్వం…