పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కొత్త లుక్ ఒకటి నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. వెకేషన్ నుంచి తిరిగొచ్చిన పవన్ తాజాగా హైదరాబాద్ కు తిరిగి వచ్చారు. ఎయిర్ పోర్టులో ఆయన వస్తున్న వీడియోను తీసిన ఓ అభిమాని ట్విట్టర్ షేర్ చేయగా, ఇప్పుడది ట్రెండ్ అవుతోంది. అందులో పవన్ బ్లాక్ కలర్ టీ షర్ట్, జీన్స్ ధరించారు. ఇక పవన్ వెకేషన్ విషయానికొస్తే… ‘భీమ్లా నాయక్’ వాయిదా పడడంతో రష్యా విహారయాత్రకు వెళ్లారు పవన్. అక్కడ ఆయన…