రెండు పవర్ హౌజ్ లు కలిస్తే ఎలా ఉండబోతుందో చూపించడానికి అన్ స్టాపబుల్ సీజన్ 2 వేదిక సిద్ధమవుతోంది. నట సింహం నందమూరి బాలకృష్ణలోని కొత్త యాంగిల్ ని ఆడియన్స్ ని పరిచయం చేసిన ఈ టాక్ సీజన్ 2 లాస్ట్ ఎపిసోడ్ కోసం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వస్తున్నాడు. తరతరాలుగా మెగా నందమూరి అభిమానుల మధ్య ఇండస్ట్రీ పరంగా ఒక రైవల్రీ ఉంది. వచ్చే సంక్రాంతికి కూడా ‘వీర సింహా రెడ్డి’, ‘వాల్తేరు వీరయ్య’…