నిమ్స్‌లో యువకుడికి సక్సెస్ ఫుల్‌గా గుండె మార్పిడి పూర్తి చేశారు. ఆరోగ్యశ్రీ కింద ఉచితంగా చికిత్స అందిస్తున్నారు.. ప్రస్తుతం పేషెంట్ కోలుకుంటున్నారు.. ఈ విషయం తెలుసుకున్న ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ డాక్టర్లను అభినందించారు.మంత్రి.. డోనర్ కుటుంబ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు. అవయవదానంపై అవగాహన కల్పించాలని డాక్టర్లకు సూచించారు.
Swallows Set of Teeth : విశాఖపట్నంలోని ఒక వ్యక్తి పళ్ల సెట్ మింగడంతో ఊపిరితిత్తుల్లో ఇరుక్కుపోయింది. 52 సంవత్సరాల వయస్సున్న ఈ వ్యక్తి రెండు సంవత్సరాల క్రితం తనకు కృత్రిమ పళ్ల సెట్ అమర్చుకున్నాడు. సెట్ అటు ఇటు ఊడిపోతుండడంతో, నిద్రలో ఉన్నప్పుడు అది ఊడిపోయి, తెలియకుండానే ఆయన దాన్ని మింగేసి ఊపిరితిత్తుల్లోకి వెళ్లిపోయింది. పళ్ల సెట్ కుడి ఊపిరితిత్తి మధ్య భాగంలో ఇరుక్కుంది. అయితే ఎడమ ఊపిరితిత్తి సహజంగా పనిచేస్తుండటంతో శ్వాసకోణంలో ఎలాంటి సమస్యలు…