సంక్రాంతిని పురస్కరించుకొని ప్రయాణీకులు తమ స్వంత ఊళ్లకు బయలు దేరారు. అయితే ప్రభుత్వం 8వ తేది శనివారం నుంచే విద్యాసంస్థలకు, ప్రభుత్వ కార్యాలయాలకు సెలవులు ప్రకటించగా 9వ తేది ఆదివారం ఉదయం నుంచే విజయవాడ-హైద్రాబాద్ జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జాం అయింది. కాగా 13 గురువారం కూడా కిలో మీటర్ల మేర వాహనాలు బారులు తీరాయి. ఉమ్మడి నల్గొండ జిల్లా చౌటుప్పల్ మండలం పంతంగి లోట్ ప్లాజా, విజయవాడకు సమీపంలోని పొట్టిపాడు టోల్ ప్లాజా వద్ద…