పాస్టర్ ప్రవీణ్ కేసుపై తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ నరసింహ కిషోర్ మీడియాకు కీలక విషయాలు వెల్లడించారు. అనుమానాస్పద మృతి కేసుగా దర్యాప్తు చేస్తున్నామని.. ప్రధానంగా రెండు సీసీ ఫుటేజ్ లు లభించాయనీ తెలిపారు. హైదరాబాదు నుంచి బుల్లెట్ పై రాజమండ్రికి వస్తున్న సమయంలో సోమవారం అర్ధరాత్రి 11 గంటల 42 నిమిషాలకు ఒక కారుతోపాటు ఐదు వాహనాలు ప్రవీణ్ బుల్లెట్ ని దాటుకొని వెళ్లాయనీ సిసి ఫుటేజ్ ఆధారాలు ప్రదర్శించారు.. రెడ్ కలర్ కారు… ప్రవీణ్ ప్రయాణిస్తున్న…
పాస్టర్ ప్రవీణ్ మృతదేహానికి రాజమండ్రి ప్రభుత్వ ఆస్పత్రిలో పోస్టుమార్టం ముగిసింది.. ఆ తర్వాత ప్రవీణ్ భౌతికకాయాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు వైద్యులు.. దీంతో, రాజమండ్రి ప్రభుత్వాసుపత్రి నుండి హైదరాబాద్ కు అంబులెన్స్ లో ప్రవీణ్ డెడ్‌బాడీని తరలిస్తున్నారు కుటుంబ సభ్యులు.. అయితే, రాజమండ్రి ఆస్పత్రికి వచ్చిన కేఏ పాల్.. ఈ ఘటనపై సీబీఐ విచారణ జరపాలని డిమాండ్ చేశారు..