Hyderabad: ఎంజీబీఎస్ మెట్రో స్టేషన్‌లో పాస్ పోర్ట్ సేవా కేంద్రం ప్రారంభమైంది.. మంత్రి పొన్నం ప్రభాకర్ ఈ సేవలను ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. దేశంలోనే మొట్టమొదటి సారిగా మెట్రో స్టేషన్‌లో పాస్ పోర్ట్ సేవలు అందుబాటులోకి వచ్చాయని తెలిపారు.. పాస్ పోర్ట్ ఇవ్వడంలో దేశంలోనే హైదరాబాద్ ఐదవ స్థానంలో ఉందన్నారు.. తెలంగాణలో ఇప్పటి వరకు ఐదు పాస్ పోర్ట్ సేవ కేంద్రాలు ఉన్నాయని వివరించారు.. తెలంగాణాలో రోజుకు 4500 పాస్ పోర్టులు ఇచ్చే సౌకర్యం ఉంది..
2024-25 ఆర్థిక సంవత్సరానికి పాస్‌పోర్ట్ దరఖాస్తుల ధృవీకరణ ప్రక్రియను సమర్థవంతంగా నిర్వహించినందుకు గుర్తింపుగా, విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలంగాణ పోలీసులకు "సర్టిఫికేట్ ఆఫ్ రికగ్నిషన్"ను ప్రదానం చేసింది. జూలై 24, 2024న న్యూఢిల్లీలో జరిగిన పాస్‌పోర్ట్ సేవా దివస్ కార్యక్రమంలో ఈ ప్రశంసా పత్రాన్ని తెలంగాణ ఇంటెలిజెన్స్ డైరెక్టర్ జనరల్ బి. శివధర్ రెడ్డి ఐసీఎస్ స్వీకరించారు. విదేశాంగ శాఖ సహాయ మంత్రి పబిత్ర మార్గెరిటా హాజరై గుర్తింపు పత్రాన్ని అందించారు.
Misfire: ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలో విషాదం చోటు చేసుకుంది. పాస్‌పోర్టు వెరిఫికేషన్ పోలీస్ స్టేషన్‌కి వెళ్లిన మహిళ అనూహ్యంగా మరణించింది. అదే సమయంలో ఓ అధికారి చేతుల్లో ఉన్న తుపాకీ మిస్ ఫైర్ అయింది. బుల్లెట్ మహిళకు తాకడంతో అక్కడే నేలపై పడిపోయింది యూపీలోని అలీఘర్ పట్టణంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. ఇష్రత్ అనే మహిళను ఆస్పత్రికి తరలించారు, ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఈ రోజు మధ్యాహ్నం 2.50 గంటల ప్రాంతంలో ఈ…