తెలుగు సినిమా పరిశ్రమలో దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి ఒక బ్రాండ్. ఆయన సినిమాలు కేవలం కథ, విజువల్ గ్రాండియర్‌తోనే కాదు, తనదైన ప్రమోషన్ వ్యూహాలతో కూడా ప్రేక్షకులను ఆకర్షిస్తాయి. “ప్రమోషన్స్‌లో రాజమౌళి పీహెచ్‌డీ చేశాడు” అని అంటే అతిశయోక్తి కాదు. ఆయన చేసే ప్రతి సినిమా విషయంలోనూ ఒక అనూహ్యమైన ఉత్కంఠ, ఆసక్తి ప్రేక్షకుల్లో నెలకొల్పడంలో ఆయన సిద్ధహస్తుడు. ఇప్పుడు సూపర్‌స్టార్ మహేష్ బాబుతో తీస్తున్న కొత్త చిత్రం SSMB29 విషయంలోనూ రాజమౌళి తన ప్రమోషన్ మాయాజాలాన్ని…