Fight on flight: ఇటీవల కాలంలో ఫ్లైట్ లో ప్రయాణికుల మధ్య ఘర్షణలు చోటు చేసుకుంటున్నాయి. ప్రయాణికులు ఒకరిపై ఒకరు దాడి చేసుకుంటున్నారు. వీరిని శాంతింప చేయడం విమాన సిబ్బందికి తలనొప్పిగా మారుతోంది. తాజాగా మరోసారి అలాంటి ఘటనే జరిగింది. థాయ్ స్మైల్ ఎయిర్ వేస్ లో ప్రయాణికులు మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. బ్యాంకాక్ నుంచి కోల్‌కతా వస్తున్న విమానంలో ఇద్దరు ప్రయాణికులు ఒకరిపై ఒకరు చేయిచేసుకున్నారు.