పంజాబ్ బీజేపీ చాలా మంది నేతలపై చర్యలు తీసుకుంది. పార్టీ వ్యతిరేక కార్యకలాపాల కారణంగా మాజీ క్యాబినెట్ మంత్రితో సహా డజను మంది నాయకులను 6 సంవత్సరాల పాటు పార్టీ నుంచి బహిష్కరించింది. వేటు పడిన వారిలో భగత్ చున్నీలాల్ కూడా ఉన్నారు. ఆయన పంజాబ్ ప్రభుత్వంలో క్యాబినెట్ మంత్రిగా పనిచేశారు.