TMC leader arrested by CBI: పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. టీఎంసీ కీలక నేత, సీఎం మమతా బెనర్జీకి అత్యంత సన్నిహితుడైన బీర్భూమ్ టీఎంసీ అధ్యక్షుడు అనుబ్రతా మోండల్ ను సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్(సీబీఐ) అరెస్ట్ చేసింది. గురువారం బీర్భూమ్ లోని అతని నివాసంలో సీబీఐ అనుబ్రతా మోండల్ ను అదుపులోకి తీసుకుంది. పశువుల అక్రమ కేసు దర్యాప్తులో భాగంగా సీబీఐ అరెస్ట్ చేసింది. 2020లో సీబీఐ పశువుల అక్రమ…
శ్చిమ బెంగాల్‌లో టీచర్ రిక్రూట్ మెంట్ స్కామ్‌లో మాజీ మంత్రి పార్థా ఛటర్జీ అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. ఈ కేసు దర్యాప్తులో భాగంగా చేపట్టిన తనిఖీల్లో పార్థా ఛటర్జీ సన్నిహితురాలు, సినీ నటి అర్పితా ముఖర్జీ ఇంట్లో గుట్టల కొద్దీ నోట్ల కట్టలు బయటపడిన సంగతి కూడా తెలిసిందే. తాజాగా ఆమెకు చెందిన నాలుగు లగ్జరీ కార్లను వెతికే పనిలో అధికారులు ఉన్నారు. ఆ కార్లలో పెద్ద ఎత్తున డబ్బు దాచిపెట్టినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.
Intimate toys recovered from Arpita Mukherjee's flat: పశ్చిమ బెంగాల్ రాజకీయాలతో పాటు త్రుణమూల్ కాంగ్రెస్ పార్టీని మంత్రి పార్థ ఛటర్జీ వ్యవహారం ఓ కుదుపు కుదిపింది. బెంగాల్ స్కూల్ రిక్రూట్మెంట్ స్కామ్ లో ఈడీ పార్థ ఛటర్జీ సన్నిహితు ఇళ్లపై దాడులు చేశారు. పార్థఛటర్జీ సన్నిహితురాలిగా ఉన్న అర్పితా ముఖర్జీ ఇంట్లో ఈడీ సోదాలు నిర్వహించింది. ఈడీ కళ్లు బైర్లకమ్మేలా.. ఏకంగా 50 కోట్ల నగదుతో పాటు కిలోల కొద్ది బంగారం బయటపడింది. మొత్తం…
పశ్చిమ బెంగాల్ టీచర్ రిక్రూట్‌మెంట్ కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న మంత్రి పార్థ ఛటర్జీని ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మంత్రి పదవి నుంచి తొలగించారు. ఇప్పటికే ఈ స్కాంలో ఆయన అరెస్ట్ అయ్యారు. పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం ఈ మేరకు ప్రకటన విడుదల చేసింది.
స్కూల్ రిక్రూట్‌మెంట్ స్కామ్‌కు సంబంధించి అరెస్టయిన పశ్చిమ బెంగాల్ మంత్రి పార్థ ఛటర్జీ సహచరురాలు సినీనటి అర్పితా ముఖర్జీకి సంబంధించి కోల్‌కతాలోని ఓఇంట్లో మరోసారి భారీగా నోట్ల కట్టలు బయట పడ్డాయి. గత శుక్రవారం ఈడీ సోదాల్లో ఆమె ఇంట్లో సుమారు రూ. 21 కోట్ల నగదు, ఆభరణాలు బయట పడగా తాగాజా.. మరోసారి భారీ మొత్తంలో డబ్బు బయటపడటం కలకలం రేపుతోంది. బెల్ఘరియా టౌన్ క్లబ్‌లోని ముఖర్జీ నివాసం నుంచి భారీ మొత్తంలో నగదు స్వాధీనం…
టీచర్ రిక్రూట్‌మెంట్ కుంభకోణానికి సంబంధించి అరెస్టయిన పశ్చిమ బెంగాల్ మంత్రి పార్థ ఛటర్జీకి దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు ఉన్నాయని, కానీ ఆసుపత్రిలో చేరాల్సిన అవసరం లేదని ఒడిశా భువనేశ్వర్‌లోని ఆల్-ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ తెలిపింది.
పశ్చిమబెంగాల్ మంత్రి, తృణమూల్ కాంగ్రెస్ నేత పార్థ ఛటర్జీ కేసులో సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి. ఆదాయానికి మించి ఆయన ఆస్తులు కూడబెట్టిన తీరును ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ బయటకు తీస్తూ వస్తోంది. తాజాగా ఈడీ విచారణలో మరో సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. ఆయన తన కుక్కల కోసమే ఓ లగ్జరీ ఫ్లాట్‌ను కొన్నట్లు ఈడీ విచారణలో తేలింది.
దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన పశ్చిమ బెంగాల్ టీచర్ రిక్రూట్‌మెంట్ స్కామ్‌లో శనివారం ఉదయం కీలక పరిణామం చోటుచేసుకుంది. పశ్చిమ బెంగాల్‌లో జరిగిన ఉపాధ్యాయ రిక్రూట్‌మెంట్ స్కాంతో ముడిపడి ఉన్న మనీలాండరింగ్ కేసుకు సంబంధించి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ పశ్చిమ బెంగాల్ మంత్రి పార్థ ఛటర్జీని అరెస్టు చేసింది. మంత్రి సన్నిహితుడి నుంచి రూ.20 కోట్లు స్వాధీనం చేసుకున్న కొన్ని గంటల తర్వాత అరెస్టు జరిగింది. కాగా.. నగదు రికవరీ కావడంతో తృణమూల్ నేతను రాత్రంతా విచారించారు. విచారణ సమయంలో…