President Droupadi Murmu In Parliament: సోమవారం నాడు మొదలైన పార్లమెంట్ శీతాకాల సమావేశాలు మంగళవారం నాడు రెండో రోజు కొనసాగుతున్నాయి. నేటితో రాజ్యాంగ సభ రాజ్యాంగాన్ని ఆమోదించి 75 సంవత్సరాలు పూర్తవుతుంది. రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా ఈరోజు పార్లమెంటు ఉభయ సభల సంయుక్త సమావేశాన్ని ఏర్పాటు చేశారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సంయుక్త సమావేశంలో ప్రసంగిస్తారు. ఈ సందర్భంగా రాజ్యాంగ నిర్మాణం, చారిత్రక ప్రయాణానికి సంబంధించిన లఘు చిత్రాన్ని కూడా ప్రదర్శించనున్నారు. రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని…