హైదరాబాద్‌లోని గాంధీ భవన్‌లో పీఏసీ సమావేశం నిర్వహించి కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ సమావేశంలో వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో తెలంగాణ నుంచి కాంగ్రెస్ అగ్ర నాయకురాలు సోనియా గాంధీ పోటీ చేయాలని ఏకగ్రీవ తీర్మానం చేసింది. ఇదిలా ఉంటే.. పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి ఇంచార్జి మంత్రులను నియమించింది. 17 నియోజక వర్గాలకు 17 మంది మంత్రులకు బాధ్యతలు అప్పగించింది. సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు రెండు పార్లమెంట్ నియోజకవర్గ బాధ్యతలు అప్పగించింది పీఏసీ.
గాంధీభవన్‌లో పీఏసీ కన్వీనర్ షబ్బీర్ అలీ అధ్వర్యంలో జరిగిన కాంగ్రెస్ పొలిటికల్ అఫైర్స్ కమిటీ సమావేశం ముగిసింది. ఈ సందర్భంగా అధికారం ఇచ్చిన తెలంగాణ ప్రజలకు పీఏసీ కృతజ్ఞతలు తెలిపింది. అనంతరం పార్లమెంటు ఎన్నికలు, ఇతర కీలక అంశాలపై పీఏసీ చర్చించి నిర్ణయించింది. ముఖ్యంగా కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ తెలంగాణ నుంచి పార్లమెంట్ స్థానానికి పోటీ చేయాలని తీర్మానించినట్టు పీఏసీ పేర్కొంది. Also Read: Big Shock: నల్లగొండ మున్సిపాలిటీలో బీఆర్ఎస్కు బిగ్ షాక్ పీఏసీ…
సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ.. ఏపీలో ఎన్నికలు పార్లమెంట్ ఎన్నికలతో పాటు జరుగుతాయన్నారు. మరి పార్లమెంట్ ఎన్నికలకు ఎప్పుడు వెళ్తారో.. అనేది తెలియదని చెప్పారు. అట్టడుగు వర్గాల రాజకీయ సాధికారత సాధించడమే సీఎం జగన్ లక్ష్యం అని ఆయన చెప్పుకొచ్చారు.