యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ (వైసీపీ)ని గ్రామస్థాయి నుంచి పటిష్ట పరచాలని నిర్ణయం తీసుకున్న పార్టీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్.. అందుకు అనుగుణంగా చర్యలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగా పార్టీలో నూతన నియామకాలు జరిగాయి. పదవుల భర్తీలో భాగంగా పలు నియామకాలను జగన్ చేపట్టారు. పార్లమెంట్ నియోజకవర్గ పరిశీలకులను నియమిస్తూ వైసీపీ పార్టీ కేంద్ర కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది. సింగనమల అసెంబ్లీ నియోజకవర్గం సమన్వయకర్తగా మాజీ మంత్రి సాకే శైలజానాథ్‌ను…