Heat Wave: ప్రపంచ ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. శిలాజ ఇంధనాల వాడకం పెరగడం, వాతావారణ కాలుష్యం వెరిసి భూమి సగటు ఉష్ణోగ్రతలను పెంచుతున్నాయి. దీంతో హిమనీనదాలు కరుగుతున్నాయి. కొన్నేళ్లలో అంటార్కిటికాలోని మంచు కరిగి సముద్ర నీటి మట్టాలు పెరిగే అవకాశం ఉందని, దీంతో తీర ప్రాంతాల్లోని నగరాలకు ముప్పు ఉందని పరిశోధకలు హెచ్చరిస్తున్నారు.
ఒక సూర్యుడు, ఒకే ప్రపంచం, ఒకే గ్రిడ్ అందరికీ సౌరశక్తిని అందించడానికి వీలు కల్పిస్తుందని భారత ప్రధాని మోడీ అన్నారు. మంగళవారం గ్లాస్గోలో జరుగుతున్న COP26 వాతావరణ శిఖరాగ్ర సదస్సు సందర్భంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ‘ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఫర్ రెసిలెంట్ ఐలాండ్ స్టేట్స్’ (IRIS)ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ప్రధాని మోడీ మాట్లాడుతూ వాతావరణ మార్పుల ఆగ్రహాన్ని ఎవరూ ఆపలేరని గత కొన్ని దశాబ్దాలు రుజువు చేశాయన్నారు. అనంతరం స్విట్జర్లాండ్, ఫిన్లాండ్, ఇజ్రాయెల్, నేపాల్, మలావి,…