అనకాపల్లి జిల్లా పరవాడలోని వెన్నెలపాలెం గ్రామంలో టీడీపీ, వైసీపీ వర్గాల మధ్య వివాదం మొదలైంది.. పరవాడ మండలం, మాజీ మంత్రి మాడుగుల ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి స్వగ్రామం.. అయితే వెన్నెలపాలెం గ్రామంలో వినాయక చవితి వేడుకల్లో రెండు వర్గాల మధ్య వివాదం చోటు చేసుకుంది.
అనకాపల్లిలోని పరవాడ మండలంలోని వెన్నెలపాలెంలోని టీడీపీ నేత, మాజీ మంత్రి బండారు సత్యనారాయణ ఇంటి దగ్గర తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. మాజీ మంత్రి బండారు ఇంటి దగ్గర పోలీసు యాక్షన్ మొదలైంది. బండారు ఇంట్లోకి పోలీసులు చొచ్చుకుపోయారు. ఆయనను తీసుకెళ్లేందుకు వచ్చిన అంబులెన్స్‌ను పోలీసులు అడ్డుకున్నారు.
ఏపీలో ఒకవైపు విద్యుత్ కోతలు.. మండుతున్న ఎండలతో జనం ఇబ్బందులు పడుతున్న వేళ మరో పిడుగు పడింది. విశాఖపట్టణం సమీపంలోని ఎన్టీపీసీ సింహాద్రిలోని 4 యూనిట్లలో ఒకేసారి విద్యుదుత్పత్తి నిలిచిపోవడంతో అంధకారం నెలకొంది. మంగళవారం ఉదయం 3 గంటల నుంచి 2 వేల మెగావాట్ల ఉత్పత్తి నిలిచిపోయింది. దీంతో ఎన్టీపీసీ పరిసరాలు అంధకారంలోకి వెళ్లిపోయాయి. వెంటనే రంగంలోకి దిగిన అధికారులు విద్యుదుత్పత్తిని పునరుద్ధరించే చర్యలు చేపట్టారు. ఒకేసారి నాలుగు యూనిట్లలో విద్యుదుత్పత్తి నిలిచిపోవడం ఇదే ప్రథమం అని…