హాలిడే ట్రిప్‌లో ఎంజాయ్ చేద్దామని బీచ్‌కు వెళ్లిన దంపతులకు ఊహించని షాక్ ఎదురైంది. దీంతో ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని ఇంటికి తిరిగివచ్చారు. ఈ ఘటన మహారాష్ట్రలో చోటు చేసుకుంది. గుజరాత్‌కు చెందిన అజిత్-సరళ దంపతులు హాలిడే ట్రిప్ కోసం దయూలోని నంగావ్ బీచ్‌కు వచ్చారు. అక్కడ పారా సెయిలింగ్ చేయాలనుకున్నారు. దీంతో పారా సెయిలింగ్ నిర్వాహకులు వారిని పవర్ బోట్ సహాయంతో పారాచూట్ ద్వారా ఆకాశంలోకి పంపించారు. అలా సముద్రంలో పారా సెయిలింగ్ చేస్తున్న దంపతులు ఒక్కసారిగా…