పారిస్ పారాలింపిక్స్ 2024లో భారత పారా అథ్లెట్లు పతక వేటలో దూసుకెళ్తున్నారు. ఇప్పటికే పారాలింపిక్స్ చరిత్రలో అత్యుత్తమ ప్రదర్శన నమోదు చేసిన భారత్.. ఈసారి పెట్టుకున్న లక్ష్యాన్ని కూడా అందుకుంది. గురువారం భారత్ ఖాతాలో 25వ పతకం చేరింది. పారాలింపిక్స్ జూడోలో కపిల్ పర్మార్ దేశానికి పతకం అందించాడు. పురుషుల 60 కేజీల జే1 విభాగంలో కాంస్యం సాధించాడు. భారత్ పతకాల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. నేటి షెడ్యూల్ ఇదే: పారా అథ్లెటిక్స్: పురుషుల…
Paralympics 2024 India Schedule Today: పారిస్‌లో భారత పారా అథ్లెట్లు అంచనాలను మించిపోయారు. 5 రోజుల వ్యవధిలోనే ఐదు స్వర్ణాలు సహా 24 పతకాలు సాధించి ఔరా అనిపించారు. నాలుగో రోజే 20 పతకాల మార్కును అందుకుని.. టోక్యోలో 19 పతకాలతో నెలకొల్పిన రికార్డును బ్రేక్ చేశారు. ఈసారి పెట్టుకున్న 25 పతకాల లక్ష్యాన్ని అందుకునే దిశగా అడుగులు వేస్తున్నారు. బుధవారం ఆర్చర్ హర్విందర్ సింగ్ స్వర్ణం గెలిస్తే.. షాట్‌పుటర్ సచిన్ ఖిలారి రజతం గెలిచాడు.…
Paralympics 2024 India Schedule Today: పారిస్ పారాలింపిక్స్‌లో భారత అథ్లెట్లు దుమ్మలేపుతున్నారు. ఇపటివరకు భారత్ ఖాతాలో 20 పతకాలు చేరాయి. ఇందులో మూడు స్వర్ణాలు, ఏడు రజతాలు, 10 కాంస్య పతకాలు ఉన్నాయి. పారాలింపిక్స్‌లో భారత్‌కు ఇదే అత్యుత్తమ ప్రదర్శన. ఇదివరకు 2020 టోక్యో పారాలింపిక్స్‌లో భారత్ అత్యధిక పతకాలను (19-ఐదు స్వర్ణాలు, ఎనిమిది రజతాలు, ఆరు కాంస్యాలు) గెలుచుకుంది. ఆ రికార్డు ఇప్పుడు బ్రేక్ అయింది. నేడు కీలక పోటీలు ఉన్న నేపథ్యంలో మరిన్ని…
Paralympics 2024 India Schedule Today: పారిస్ పారాలింపిక్స్‌లో శుక్రవారం నాలుగు పతకాలు సాధించిన భారత్.. శనివారం ఒక పతకం మాత్రమే సాధించింది. షూటింగ్‌లోనే మరో పతకం దక్కింది. రుబీనా ఫ్రాన్సిస్ కంచు గెలవడంతో పతకాల సంఖ్యను ఐదుకు చేరింది. బ్యాడ్మింటన్‌లో కనీసం ఓ పతకం ఖాయమైంది. సుకాంత్, సుహాస్ నేడు సెమీస్‌లో తలపడనున్నారు. భారీ అంచనాలతో బరిలో దిగిన ఆర్చర్ శీతల్ నిరాశపర్చింది. వ్యక్తిగత విభాగంలో ప్రిక్వార్టర్స్‌లోనే ఆమె నిష్క్రమించింది. నేడు భారత్ ఖాతాలో మరిన్ని…
పారిస్ పారాలింపిక్స్ 2024లో భారత క్రీడాకారుల పతక వేట ఘనంగా ఆరంభమైంది. శుక్రవారం ఒక్క రోజే నాలుగు పతకాలు ఖాతాలో చేరాయి. ఇందులో ఓ స్వర్ణం కూడా ఉంది. టోక్యోలో స్వర్ణం, కాంస్యం గెలిచిన యువ షూటర్ అవని లేఖరా.. పారిస్‌లోనూ గోల్డ్ గెలిచింది. షూటింగ్‌లోనే మనీశ్ నర్వాల్ రజతం, మోనా కాంస్యం గెలిచారు. ఇక 100 మీటర్ల పరుగులో ప్రీతి పాల్ కంచు పతకం సాధించింది. నేడు కూడా భారత్ ఖాతాలో పతకాలు చేరే అవకాశాలు…