TGTET Exam: నేటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా టెట్ పరీక్షలు మొదలు కానున్నాయి. ఈ పరీక్షలు నేటి నుండి ఈ నెల 20వ తేదీ వరకు కొనసాగనున్నాయి. 17 జిల్లాల్లో మొత్తం 92 పరీక్షా కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు. రోజుకు రెండు సెషన్లుగా పరీక్షలను నిర్వహిస్తున్నారు. టెట్‌కు రెండు పేపర్లకు కలిపి మొత్తం 2,75,773 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో పేపర్-I కు 94,335 మంది, పేపర్-IIకు 1,81,438 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు.…