Gurpatwant Singh Pannun: ఖలిస్తానీ ఉగ్రవాది గురుపత్వంత్ సింగ్ పన్నూ హత్యకు కుట్ర పన్నాడనే అభియోగాలతో నిఖిల్ గుప్తా అనే భారతీయుడిని అమెరికా కోరిక మేరకు చెక్ రిపబ్లిక్ అధికారులు అరెస్ట్ చేశారు. ప్రస్తుతం అతడు చెక్ రిపబ్లిక్ జైలులో ఉన్నారు. ఇదిలా ఉంటే ఈ కేసులో నిఖిల్ గుప్తా కుటుంబం సుప్రీంకోర్టుని ఆశ్రయించింది. భారత ప్రభుత్వం ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని కోరింది.
Pannun case: ఖలిస్తానీ ఉగ్రవాది గురుపత్వంత్ సింగ్ పన్నూ కేసులో భారతీయ వ్యక్తి నిఖిల్ గుప్తా(52)ను తమకు అప్పగించాలని అమెరికా కోరుతున్నట్లు చెక్ రిపబ్లిక్ అధికారులు తెలిపారు. నిఖిల్ గుప్తా కస్టడీని చెక్ అధికారులు ధ్రువీకరించారు. పన్నూ హత్య కుట్రలో ఇతని పాత్ర ఉందని అమెరికా ఆరోపిస్తోంది. భారత ప్రభుత్వ ఉద్యోగి ఆధ్వర్యంలో నిఖిల్ గుప్తా అమెరికా గడ్డపై, అమెరికన్ పౌరుడు పన్నూను చంపేందుకు కుట్ర పన్నినట్లు అభియోగాలు ఎదుర్కొంటున్నారు. గుప్తాను ఈ ఏడాది జూన్ నెలలో…