తాలిబన్ల శకం ఆరంభం అయినప్పటి నుంచి పంజ్‌షీర్ ప్రావిన్స్ వారికి కొరకరాని కొయ్యగా మారింది. 1994 ప్రాంతంలో కూడా తాలిబన్లు ఆఫ్ఘనిస్తాన్‌ను ఆక్రమించుకున్నప్పటికీ పంజ్‌షీర్ మాత్రం వారికి దొరకలేదు. అప్పటి నుంచి అక్కడి స్థానిక సాయుధులు తాలిబన్లతో ఫైట్ చేస్తూనే ఉన్నారు. కాగా, ఇప్పుడు కూడా తాలిబన్లతో పంజ్‌షీర్ సేనలు పోరాటం చేస్తున్నాయి. పంజ్‌షీర్ సేనలు 6 వేల వరకు ఉండగా, తాలిబన్ల సైన్యం అపారంగా ఉంది. పైగా వారివద్ద అధునాతన ఆయుధాలు ఉన్నాయి. ఇప్పుడు ఆఫ్ఘన్…
ఆఫ్ఘనిస్తాన్‌లోని పంజ్‌షీర్ ప్రావిన్స్‌లో మళ్లీ ఉద్రికత్తలు చోటు చేసుకున్నాయి. పంజ్‌షీర్ ప్రావిన్స్ ఇప్పటి వరకు తాలిబన్ల వశం కాలేదు. ఆ ప్రావిన్స్‌లోకి అడుగుపెట్టనివ్వబోమని అక్కడి సైన్యం చెబుతున్నది. అయితే, ఎలాగైనా ఆక్రమించుకోవాలని తాలిబన్లు పట్టుదలతో ఉన్నారు. ఈ నేపథ్యంలో పంజ్‌షీర్‌లో తిరుగుబాటుదారుల కోసం తాలిబన్లు సెర్చ్ ఆపరేషన్ నిర్వహిస్తున్నారు. దీంతో పంజ్‌షీర్ సైన్యం తాలిబన్లపై విరుచుకుపడింది. పంజ్‌షీర్ సైన్యం దాడిలో 300 మంది తాలిబన్లు హతం అయినట్టు సైన్యం ప్రకటించింది. ఈ విషయాన్ని అంతర్జాతీయ మీడియా కూడా…