బాలికల వివాహ వయస్సు పెంపునకు ఉద్దేశించిన బాల్య వివాహాల నిషేధం (సవరణ) బిల్లు- 2021తో దేశ వ్యాప్తంగా హడావుడి పెళ్లిళ్లు పెరిగాయి. ఈ బిల్లు చట్టంగా మారితే బిడ్డ పెళ్లి ఆలస్యమవుతుందని ఆడపిల్లల తల్లిదండ్రులు భావిస్తున్నారు. ప్రస్తుతం ఇది పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ పరిశీలనలో ఉంది. ఇండియన్ క్రిస్టియన్ మ్యారేజ్ యాక్ట్, పార్సీ మ్యారేజ్ అండ్ డైవోర్స్ యాక్ట్, ముస్లిం పర్సనల్ లా (షరియత్), అప్లికేషన్ యాక్ట్ , ది స్పెషల్ మ్యారేజ్ యాక్ట్, హిందూ మ్యారేజ్…