భారత జట్టులో కరోనా కలకలం రేపింది. టీం ఇండియా ఆల్ రౌండర్ కృనాల్ పాండ్యాకు కరోనా పాజిటివ్ గా తేలింది. అయితే కోహ్లీ నేతృత్వంలోని ఓ భారత జట్టు ప్రస్తుతం ఇంగ్లాండ్ లో పర్యటిస్తుండగా శిఖర్ ధావన్ కెప్టెన్సీలోని మరో జట్టు శ్రీలంకతో పరిమిత ఓవర్ల సిరీస్ లో తలపడుతుంది. అయితే ఇప్పటికే వన్డే సిరీస్ ను 2-1 తో ధావన్ సేన సొంతం చేసుకోగా ప్రస్తుతం టీ20 సిరీస్ లో 1-0 తో ఆధిక్యంలో ఉంది.…